
1976 సంవత్సరంలో ఎక్కడి నుంచో వచ్చిన గురమ్మ రెంజల్ మండలం కూనేపల్లి గ్రామ శివాలయంలో గత 38 సంవత్సరాలుగా శివుడికి పూజలు అందించిన గురమ్మ అనారోగ్యంతో మృతి చెందగా గ్రామస్తులంతా కలిసి ఆమె అంతిమ దహన సంస్కారాలకు శ్రీకారం చుట్టారు. నా అనేవారు లేని ఈ వృద్ధురాలిని గ్రామస్తులందరూ పూజారిగా కొలుస్తూ 38 సంవత్సరాలు అక్కడే ఆమెకు సౌకర్యాలను కల్పించగా, ఆమె శివుడిని ఆరాధిస్తుంది 38 సంవత్సరాలు అక్కడే గడిపింది. ఆమె అనారోగ్యంతో మృతిచెందగా గ్రామస్తులందరూ కలిసి ఆమెకు ఘనంగా దహన సంస్కారాలను నిర్వహించారు.