మండలంలో ఘనంగా దీపావళి వేడుకలు

Grand Diwali celebrations in Mandalనవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని గ్రామాల్లో ప్రజలు వ్యాపారస్తులు ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. ఇంటి వాకిళ్లలో అందమైన రంగు రంగుల ముగ్గులు వేసి దీపాలను పెట్టారు.దుకాణ సముదాయాల్లో, ఇండ్లల్లో  సాయంకాలం నుండి భక్తి ప్రభత్తులతో లక్ష్మీ పూజలు నిర్వహించి, మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కలసి సంబరాలు చేసుకున్నారు. రంగు రంగు కాంతులతో కూడిన బాణాసంచ పేలుళ్లు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. దీపావళి పురస్కరించుకొని ఇండ్లను, దుకాణాల సముదాయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైదరాబాద్ లోని తన స్వగృహంలో రాష్ట్ర మాజీ మంత్రి,  బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలను జరుపుకున్నారు. తన సతీమణి నీరజ రెడ్డి, కుమారుడు, కూతురు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కలసి వేడుకలు చేసుకున్నారు.