– హాజరైన తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్ రెడ్డి
నవతెలంగాణ -పెదవూర
మండలంలో దసరా వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈఉత్సవాలకు పెద్దవూర గ్రామానికి చెందిన తెలంగాణ ప్రభుత్వ హైకోర్టు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ తేర రజినీకాంత్ రెడ్డి హాజరయ్యారు.దేవీ నవరాత్రుల సందర్బంగా మండలంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఘన సన్మానం చేశారు. సాయిత్రం మండలం కేంద్రం లోని పెద్దవూర,నాగార్జున సాగర్ జాతీయ రహదారి చౌరాస్తాలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాజశేకర్,ఎస్ఐ వీరబాబు,మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి,మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి మాజీ ఎంపీటీసి కత్తి మహాలక్ష్మి,కర్నాటి శ్రీనివాస్ రెడ్డి,ముత్యాల్ రెడ్డి, కర్ణాటి మునిరెడ్డి, బోయ నరేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు కిలారీ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.