
తుంగతుర్తి మండల కేంద్రంలో ఎలక్ట్రీషియన్,టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఎలక్ట్రిషన్ డే ను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిషన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిషన్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ మేరకు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కేక్ కట్ చేశారు.అనంతరం ఎలక్ట్రిషన్ సభ్యులకు లేబర్ కార్డు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ కటకం అశోక్, తుంగతుర్తి టౌన్ అధ్యక్షులు మడూరి ప్రవీణ్,అంబటి బుచ్చయ్య,కటకం బ్రహ్మచారి, కటకం వెంకన్న,తాటిపాముల ఉపేంద్ర చారి,కటకం రవి, మల్లెపాక సుధాకర్,ఇస్లావత్ రవి,షేక్ యాకు,గుణగంటి రమేష్,కటకం యువరాజ్,నారాయణదాసు నరసయ్య,నరాల సురేష్ రెడ్డి,వరుణ్,కేశగాని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.