పట్టణ పరిధిలోని స్థానిక బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని,బోనం ఎత్తి ర్యాలీ బయలుదేరి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.అలాగే రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాకులు,భక్తులు పాల్గొన్నారు.