జక్రాన్ పల్లి గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో గాందీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బ్రహ్మానందం మండల కో ఆప్షన్ సభ్యులు అక్బర్ ఖాన్,అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ  నరేష్, రేషన్ డీలర్ మండల అధ్యక్షులు పెద్ది లక్ష్మణ్, మహిళలు సుమలత, దివ్య, ఫీల్డ్ అసిస్టెంట్ , గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం మృతి చెందిన  తేజశ్రీకి రెండు నిమిషాలు మౌనం పాటించారు.