– శ్రీకృష్ణుని వేషాదారణలో అలరించిన చిన్నారులు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని పలు తాండలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పోచారం తండాలో పెద్దలు యువకులు చిన్నారులు ప్రజలు పాల్గొని శ్రీ కృష్ణ చిత్ర పటానికి తాండ వాసులు కొబ్బరికాయలు కొట్టి తీపి నైవేద్యంతో పూజలు చేసిన అనంతరం ఉట్టి కార్యక్రమన్నీ తాండ వాసులు ప్రారంభించారు.చిన్నారులతో ఉట్టి వేడుకలు నిర్వహించగా, చిన్నారులంతా చిన్ని కృష్ణుని వేషా ధా రణలతో హుషారుగా పాల్గొని ఈలలు వేస్తూ ఉట్టిన కొడుతూ కేరింతలు వేస్తూ హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ,యువకులు తాండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.