
సదాశివ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో సోమవారం రోజు గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహాలు, విశిష్టతలకు ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గురువుకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అవేరేజ్ బాబా, పురుషోత్తం బాబా, కృష్ణమాయ్, సోనీ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.