ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు 

Grand Guru Poornami celebrationsనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శివ సాయి బాబా ఆలయం వివి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఆలయం ఆవరణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు అభిషేకం ఎనిమిది గంటల 30 నిమిషాలకు హారతి మహిళ భక్తులతో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు శాలువా పూలమాలతో కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సీనియర్ ఉపాధ్యాయులు గుర్రం రాజారెడ్డిని నలభై సంవత్సరాల సర్వీసు చేసి రిటైర్ అయిన వారిని కమిటీ అధ్యక్షులు రాజేందర్రెడ్డి, కార్యదర్శి విశ్వజిత్ రెడ్డి తో పాటు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మరో సీనియర్ ఉపాధ్యాయుడు రాజుల గంగాధర్ను కాలనీ సీనియర్ సలహాదారులు భూపాల్ రెడ్డి సన్మానించగా, మరొక సీనియర్ ఉపాధ్యాయుడు రఘువీర్ రెడ్డిని కమిటీ సభ్యులు గంగారం, కోటేశ్వరరావు, రామచందర్ రెడ్డి,లు సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గురు పౌర్ణమి సందర్భంగా చదువులు చెప్పిన గురువులను సన్మానించడం, పూజించడం, తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్యాంసుందర్ ఉపాధ్యక్షులు గంగారం, రఘువీర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి గంగాధర్ కోటేశ్వరరావు సలహాదారులు ఆంజనేయులు, అమర్ జీత్ రెడ్డి, రామచందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కమిటీ సభ్యులతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.