ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

Grand Guru Poornami celebrationsనవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మోతె భాగ్యలక్ష్మి- ఎల్లారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అడీతం కుమార్, పంజాల రమేష్,సత్యనారాయణ,కాటం సంపత్ రెడ్డి,రేణుక. రమణారెడ్డి,భక్తులు తదితరులు పాల్గొన్నారు.