ఘనంగా గురుపూజోత్సవం

నవతెలంగాణ-వీణవంక
గురు పౌర్ణమి సందర్భంగా మండల కేంద్రంలోని శివాలయంతో పాటు చల్లూరు, మామిడాలపల్లి, బేతిగల్, నర్సింగాపూర్, రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులకు పూజారులు అర్చనలు చేశారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.