తాడ్వాయిలో ఘనంగా గురుపూజోత్సవం..

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలో మండల విద్యాశాఖ అధికారి  రామస్వామి  అధ్యక్షతన మండలంలోని వివిధ పాఠశాలల పనిచేస్తున్న 20 మంది ఉపధ్యాయులను మండల స్థాయి లో ఉత్తమ ఉపధ్యాయులుగా ఎంపిక చేసి రైతు వేదిక తాడ్వాయి లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే  జాజల సురేందర్  సహాయ సహకారాలు అందించరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి , ZPTC రమాదేవి నారాయణ, AMC చైర్మన్ సాయిరెడ్డి , సర్పంచ్ సంజీవ్ , వైస్ ఎంపీపీ  నర్సింలు, మహేందర్ రెడ్డి, వివిధ హదాల్లోని BRS నాయకులు, complex HMS  సంగారెడ్డి, వెంకటరెడ్డి, PRTU మండల బాధ్యులు రామచంద్ర రెడ్డి, సంగా గౌడ్, వివిధ పాఠశాలల ప్రధనోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.