నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని యంచ గ్రామంలో గల శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో గురు పౌర్ణిమ సందర్భంగా హోమం నిర్వహించి శ్రీ ఓం ఆదిశక్తి కేంద్ర స్వామీజీకి అభిషేకం అలంకరణ చేసి పాదపద్మములకు భక్తులతో సోమవారం పల్లకి సేవ చేశార ఈ సందర్భంగా 27 రకాల పదార్థములు పంచామృతములతో స్వామి పాదపద్మములకు అభిషేకం నిర్వహించారు. అనంతరం మహా హారతి అన్న ప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లహరి ప్రవీణ్, గ్రామ పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.