ఘనంగా గణనాథుల నిమజ్జోత్సవ వేడుకలు..

Grand immersion celebrations of Ganaths..– పూజలు చేసి శోభయాత్ర ప్రారంభించిన జిల్లా ఎస్పి 
– ముధోల్ లో గట్టి బందోబస్తు..
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తోపాటు మండలంలోని చించాల చింతకుంట తండా, ఎడ్ బిడ్ ,రాం టెక్, బ్రహ్మాన్ గాం,తదితర గ్రామాలలో శుక్రవారం గణనాథుల నిమజ్జనోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏడురోజులపాటు వివిధ మండపాలలోభక్తిశ్రద్ధలతోబొజ్జగణపయ్యలను పూజించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గణనాథులను ప్రతిష్టించి గ్రామాలలోని ప్రధాన వీధుల గుండా శోబయాత్రను నిర్వహించారు.  ముధోల్ ల్లో జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల నేతృత్వంలో బైంసా అడిషనల్ ఎస్పీ ఆవినాష్ కుమార్ అద్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు..అంతకు ముందు జిల్లా ఎస్పీ ముధోల్ లోని రాం మందీర్ లో గల సార్వజనిక్ గణేష్ మండలి వద్ద పూజలు చేసి శోభయాత్ర ను ప్రారంభించారు. అనంతరం ముధోల్ ల్లోని గణనాథుల శోభాయాత్ర వెళ్లే మార్గలను పరిశీలించి ఏఎస్పీ అవినాష్ కుమార్,  సిఐ మల్లేష్ ఎస్సై సాయికిరణ్ లకు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు సలహాలు ,సూచనలను తెలియజేశారు. గణనాథుల  నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తులు ప్రజలు భక్తి గీతాలు ఆలపిస్తూ కోలాటలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు.
లడ్డు వేలం పాట
మండల కేంద్రమైన ముధోల్ తో పాటు ఆయా గ్రామాలలో గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించారు .అలాగే భక్తులు లడ్డు దక్కించుకునేందుకు వేలంపాటలో పోటాపోటీగా పాల్గొన్నారు. ముధోల్ బిజెపి మండల అద్యక్షులు కోరి పోతన్న ముదిరాజ్ గణేష్ వద్ద లడ్డు వేలం పాట లో రూ.30వేల కు దక్కించుకున్నాడు.
గట్టి పోలీసు బందోబస్తు..
నిమజ్జనోత్సవంసందర్భంగా ముధోల్ లో  జిల్లాఎస్పీ  డా.జానకి షర్మిల,నేతృత్వంలో బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో   10మంది ఎస్ఐలు 8మంది సీఐలు 200 మంది పోలీస్ సిబ్బంది  బందోబస్తు లో పాల్గొన్నారు. ముధోల్ తో పాటు ఆయాగ్రామలల్లో గణనాథుల నిమజ్జనోత్సవం సందర్భంగా అన్నదానకార్యక్రమం నిర్వహించారు. కొన్ని గణనాథులను స్థానిక చెరువుల వద్ద నిమజ్జం చేయగా ముధోల్ తో పాటు మరికొన్ని గ్రామాలలో నిమజ్జోత్సవం ర్యాలీ కొనసాగుతుంది.