
తాడ్వాయి మండలంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ రవి, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహసిల్దార్ సునీత, సింగిల్ విండోలో చైర్మన్ కపిల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆంజనేయులు, ఎర్ర పహాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి, ఎర్రపాడు, నందివాడ, దేవికలాన్, కన్కల్, చిట్యాల, కృష్ణాజివాడి, బ్రహ్మాజీవాడి, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీల ఆవరణలో సర్పంచులు నర్సారెడ్డి, వినోద, పౌరాజు, రాధా, కవితా బాలయ్య, భూషణం, జ్యోతి, ఇందిరాలు జెండాలు ఎగరవేశారు. మండల కేంద్రంలోని రవీంద్ర భారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అందరిని అలరించాయి. విద్యార్థులు వివిధ దేశ నాయకులు వేషధారణలో అందర్నీ ఆకట్టుకున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వామి కరస్పాండెంట్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.