మద్నూర్ మండల కేంద్రంలో గల శ్రీ భక్త మార్కండేయ మందిర ఆవరణలో సోమవారం నాడు రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి కుల బంధువులు పంతులు మహేష్ కులకర్ణి ఓం మహారాజ్ ఆధ్వరంలో జంజారాల రక్షాబంధన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. సూర్య నమస్కారం చేస్తూ గాయత్రి మంత్రం అంటూ జంజారాలు శరీరంపై వేసుకున్నారు. అనంతరం పంతులు రాఖీలు కట్టారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు రచ్చ పెంటేష్ ఉపాధ్యక్షులు ఉత్తర్ సంతోష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రచ్చ కుశాల్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రమణ కోశాధికారి ఊత్తూరు శ్రీనివాస్ మేత్రిలు ఊష్కల్ సురేష్ రచ్చ నాగేష్ కుల బంధువులు మనోహర్ శ్రీనివాస్ దత్తురాం రచ్చ కృష్ణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.