ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

నవతెలంగాణ-లోకేశ్వరం : మండల కేంద్రమైన లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం  కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు తెలంగాణ భాష, యాస, కాళోజీ  గొప్పదనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గౌతం, అధ్యాపకులు చిన్నయ్య, వెంకటేశ్వర్లు,మహేందర్,సాయినాథ్,వినోద్, శ్రీధర్,విఠల్, విద్యార్థులు,
తదితరులు పాల్గొన్నారు.