ఘనంగా కార్తీక వనభోజనాల కార్యక్రమం

Karthika Vanabhojana program in Telangana Brahmin Welfare Associationనవతెలంగాణ – కంఠేశ్వర్ 

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంగం అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలోస్థానిక లక్ష్మి గణపతి దేవాలయం లో కార్తీక వనభోజనాల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంగం ఆధ్వర్యంలో ఈరోజు గోమాత పూజ ఉసిరి తులసి 75సంవత్సరాలు నిండిన వృద్ధ బ్రాహ్మణ దంపతులకు ఘనంగా సన్మానం చేయడం తో పాటు లోక కల్యాణర్థం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఒక భవనం నిర్మించుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని అదేవిదంగా వివేకానంద విదేశీ పథకం ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థులకు గతం లో సంక్షాన్ అయినా స్కాలర్షిప్ లను వెంటనే రిలీజ్ చేయాలనీ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ను నియమిస్తూ పేద బ్రాహ్మణ కుటుంబాలకు పరిషత్ ద్వారా ఆర్థిక సహాయం గతంలో లాగా చేయాలనీ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమం లో సంగం ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ, కోశాధి కారి పుల్కల్ రమేష్, పురుషోత్తం పట్వరి, శశికాంత్ కులకర్ణి, లక్ష్మి నారాయణ భరద్వాజ్,  శ్రీనాథ్ రాజ్, రాజకాంత్ రావు కులకర్ణి, శైలజ దేశ్ ముఖ్, సౌమ్య భరద్వాజ్, రొట్టె వీణ, శైలజ అవిక్షిత్, మంజుల మోతెకర్, బ్రాహ్మణ సంగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.