ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో బీఆర్ఎస్  పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అధ్వర్యంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత  శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అదినేత గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావును మండల పార్టీయే నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలపుతూ ఒక్కరికి ఒక్కరు స్వీట్లు తిని పంచుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా గత 9 సంవత్సరాల  తెలంగాణ రాష్టాని దేశంలోనే  అభివృద్ధి పథంలో నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కిందని ,వారు గొప్ప పరిపాలన దక్షకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు విజయ్ దేశాయ్, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచులు,ఆయా గ్రామ పార్టీల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.