ఘనంగా కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్..

నవతెలంగాణ – నూతనకల్
మండల కేంద్రంలోని నాగార్జున నిట్స్ ఒలంపియాడ్ పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు  గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సర్టిఫికెట్స్,గోల్డ్ మెడల్స్ వారి తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాల కరస్పాండెంట్ మారగాని వెంకట్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారులలో చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వారి ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు అవుతుందని వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మారగాని విజయలక్ష్మి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గుర్రం యాదగిరి గౌడ్, బిక్కి రామన్న, బెల్లంకొండ రమేష్, దగ్గుల యశ్వంత్, బధా వత్ వీరన్న, మొహమ్మద్ మతిన్, గోరంట్ల రాజేశ్వరి, గొడిశాల రాజేశ్వరి, మౌనిక, నవ్య, సునీత, యాస్మిన్, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.