నవతెలంగాణ-లక్షెట్టిపేట
మండలంలోని పద్మశాలి సంఘం ఆద్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలి సంఘం నాయకులు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పద్మశాలి సంఘం మండల గౌరవ అధ్యక్షుడు నడిమెట్ల రాజన్న, మండల అధ్యక్షుడు వేముల రాజగురువయ్య, ప్రధాన కార్యదర్శి భైరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాయలింగు, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, రజక సంఘం మాజీ మండల అధ్యక్షుడు మందపెల్లి తిరుపతి, పద్మశాలి సంఘం నాయకులు బోప్పు కిషన్, శంకర్, లచ్చన్న, రవి, మల్లేష్, చందు, మధు పాల్గొన్నారు.
కాసిపేట్ ఎంపీడీఓ కార్యాలయంలో
మండల పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్చ ఎంపీఓ షేక్ సఫ్దర్ అలీ, సూపరింటెండెంట్ అల్లూరి లక్ష్మణ్, సీనియర్ ఆసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మన్ బాపూజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఐ శ్వేతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.