ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు..

Grand Konda Laxman Bapuji Jayanti celebrations..నవతెలంగాణ –  రెంజల్ 

రెంజల్ మండలం ధూపల్లి గ్రామంలో శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంచుల బాబన్న మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పదవులు సైతం వదులుకొని మలి దశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఆయన కొనియాడారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన సంచుల బాబన్నను, మాజీ సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి లకు వారు ఘనంగా సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కిష్టయ్య, ప్రభాకర్, గుత్ప సాయిలు, దాము ,నరేష్, దేవి దాస్ తదితరులు పాల్గొన్నారు.