పరకాల బిట్స్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..

నవతెలంగాణ -పరకాల
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టెక్నో స్కూల్ పరకాలలో బుధవారం శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికమ్మ వేషధారన ధరించి ఉట్టి కొట్టడం, తెలంగాణ సంస్కృతి తెలియపరిచే పలు కార్యక్రమాలు చేస్తూ  కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు..