నవతెలంగాణ – చివ్వెంల
సృష్టి లయ కారకుడైన పరమేశ్వరుని ప్రీతి కరమైన మహా శివరాత్రి వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జ్ఞాన లింగేశ్వర కుటుంబ సమేత శివాలయంలో తెల్లవారు జామునుండే భక్తులు భారీగా పోటెత్తారు.భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.దేవాలయంలో వేంచేసి ఉన్న భవాని మాత అమ్మవారు శుక్రవారం లక్ష్మీదేవి రూపంలో ప్రత్యేక దర్శనం ఇచ్చారు.అలాగే ఆలయం లో ఉన్న కాలభైరవుడు,మానసదేవి,ధ్యానం లో ఉన్న శివ పార్వతులు,నవ గ్రహాలు,కార్యసిద్ధి గణపతి,లక్ష్మి గణపతి,వలి సమేత కుమారి స్వామి,సుబ్రహ్మణ్యేశ్వరుడు,శేష నాగదేవత, మహిషాసుర మర్దిని విగ్రహాలకు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయత్రం ఆలయంలో భజనలు,కోలాటం, లింగోద్భవ సమయంలో అందరికీ అభిషేకాలు,ప్రత్యేక మహన్యాస రుద్రాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ధరావత్ వీరన్న నాయక్,డిసిసి సెక్రెటరీ వెన్నె మధుకర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు కుటుంబ సమేతంగా స్వామివారికి అభిషేక నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.పలువురు భక్తులు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్నప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.