ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

నవతెలంగాణ – భీంగల్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భీంగల్ పట్టణ కేంద్రంతోపాటు మండలంలోని గ్రామాలలో గల శివాలయాలలో భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ కేంద్రంలోని నందీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాత్రి నందీశ్వర ఆలయం వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు .అలాగే మండలంలోని బడా భీంగల్ గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.