
– సందర్శకులతో కిక్కిరిసన మల్లన్న గుట్ట,నైన గుళ్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండలంలోని నాచారం గ్రామపరిదిలో ఆటవిలోగల గుట్టల్లో వెలసిన శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయంలో, కొయ్యుర్ గ్రామపరిదిలోని పివినగర్ అడవుల్లో పురాతన మహాలింగేశ్వర స్వామి ఆలయంలో, పెద్దతూoడ్ల గ్రామంలోని శ్రీహనుమాత్ సహిత శ్రీమద్రాజేశ్వరి పంచాయతన ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఆలయాల్లో శివనామస్మరణలతో మార్మోగాయి.కళ్యాణోత్సవం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో సందర్శకులు పోటెత్తారు.మానేరులో పుణ్య స్నానాలు ఆచరించి శివపార్వతులను దర్షించుకోవడానికి సందర్శకులతో ఆలయాలు కిక్కిరిశాయి.వేద పండితులు శివపార్వతుల కళ్యాణమహోత్సవం అంగరంవైభవంగా నిర్వహించారు.మల్లన్నగుట్టలో 9న శనివారం శ్రీమల్లిఖార్జున స్వామి పెద్దపట్నం, 10న నైవేర్యం, హారతి కంకనోధ్యాసన, మహదశీర్వాదము,తీర్థప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు చేవూరి రాజేందర్ తెలిపారు. శ్రీహనుమాత్ సహిత శ్రీమద్రాజరాజేశ్వరి పంచాయాతన మందిరంలలో రాత్రి 12 గంటల వరకు శివ కల్యాణం శోభాయాత్ర, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు లింగోధృవ పూజ,జగరణం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.