
నవతెలంగాణ- చండూరు
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో చండూర్ సబ్ స్టేషన్ ఆవరణలో గురువారం మేడే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్ఇన్ స్పెక్టర్ యాదగిరి జండా ఆవిష్కరించినారు. అనంతరం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా 1104 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి ఎన్. వెంకటయ్య హాజరై మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీల తో సంబంధం లేకుండా నిరంతరం విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ 1104 యూనియన్ దే అని అలాగే సంస్థలో విద్యుత్ కార్మికులు నిరంతరం కష్టపడి 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ ల వారీగా ప్రమోషన్లు కల్పించాలని,విద్యుత్ సంస్థలో ఇప్పటివరకు కార్మికులకు పదోన్నుతులను ఇవ్వలేదని వాటిని సమీక్షించి తక్షణమే పదోన్నతులు ఇవ్వాలని ఆయన అన్నారు. విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరిగి లైన్ మెన్ లపై అధిక పని భారం పడుతుందని క్షేత్రస్థాయిలో జూనియర్ లైన్మెన్ ల పోస్టులు భర్తీ చేసి పని భారం తగ్గించాలని, విద్యుత్ సంస్థలో పని చేస్తున్నటువంటి కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అదనపు కార్యదర్శి టి.శ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షులు రాంబాబు,డివిజన్ అదనపు కార్యదర్శి ఆర్.బాలు నాయక్, డిస్కం ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ముత్తయ్య, డివిజన్ కోశాధికారి యం. డి.షరీఫ్ పాష,చండూర్ సెక్షన్ లీడర్ షజ్జు పాష ,ముత్యంరెడ్డి, మనోహర్ రెడ్డి ,చంద్రమౌళి,వెంకన్న,సైదులు, కుమార్ ,గిరి, యాదయ్య,పరమేష్ ,నర్సింహ,శంకర్,కృష్ణ,గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.