
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుమ్ముల సాగర్ 50 మంది అనాధ పిల్లలకు, వృద్ధులకు అమ్మ పరివార్ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గోపాల్ రావు, మెడికల్ కాలేజ్ సూపర్ వైజర్ కక్కెర్ల సతీష్ బాబు గౌడ్ పాల్గొన్నారు.