సంఘమే శరణ్యం అది లేకుంటే అరణ్యం అనే నినాదంతో సంఘాన్ని ముందుకు నడిపించడం సంతోషకరంగా ఉందని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో సామల యాదగిరి జయంతి ని పురస్కరించుకుని పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పీఆర్టీయూ పతాకాన్ని ఆవిష్కరించి, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వేముల సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రమేష్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ.. నేడు ఉపాధ్యాయులు సాధించుకున్న హక్కులు పీఆర్టీయూ కృషి ఫలితమే అని పునరుద్ఘాటించారు. పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయ లోకానికి కల్పవృక్షం లాంటిదని అన్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు సంఘం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా బాధ్యులు సోమయ్య, ప్రభాకర్ రెడ్డి, సురేష్ కుమార్, అంజయ్య, యాకూబ్ పాషా, వెంకన్న, రవి, రాజేష్ కుమార్, శ్రీధర్, ప్రదీప్, సువర్ణ, హైమ, కరుణ తదితరులు పాల్గొన్నారు.