ఘనంగా జెంటిల్‌మన్‌ 2 ప్రారంభం

‘జెంటిల్‌మన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్‌గా అగ్ర నిర్మాత కె.టి. కుంజుమోన్‌ నిర్మిస్తున్న ‘జెంటిట్‌మన్‌ 2’ సినిమా ప్రారం భోత్సవం శనివారం చెన్నైలోని ఎగోమర్‌లోని రాజా ముత్తయ్య హోల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ సందర్భంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఘన సన్మానం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ వేడుకకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన లీడింగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ హాజరయ్యారు.
వీరితోపాటు సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎల్‌ మురుగన్‌, జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ టాగా మసయుకి, పీపుల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషన్‌ డిప్యూటీ హెడ్‌ ఆఫ్‌ మిషన్‌ అరిఫుర్‌ రెహమాన్‌, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ రవి కొట్టారా కారా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
నిర్మాత కె.టి.కుంజుమోన్‌ సతీమణి ఐరిన్‌ కుంజుమోన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.