వాగ్దేవి పాఠశాలలో ఘనంగా మహా పడి పూజ..

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల లోని శ్రీ వాగ్దేవి ప్రయివేటు ప్రాథమిక పాఠశాలలో గురువారం మల్క మోహన్ రావు, భద్రయ్య గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడి పూజ నిర్వహించారు.అంగరంగవైభవంగా అయ్యప్పకు అభిషేకం, మెట్ల పూజ నిర్వహించారు. అయ్యప్పస్వామి శరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాగం కుమార్, పాఠశాల ప్రెసిడెంట్  బూడిద సదానందం గురు స్వామి గురు స్వాములు వీరమనేని సంపత్ రావు, మల్క భాస్కర్, ఓజెల రాజ బాపు,కసగని కుమార్,గురు స్వాములు, గదా, గంట, కత్తి,కన్నె స్వాములు పాల్గొన్నారు.