ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Grand pre-Bathukamma celebrationsనవతెలంగాణ – తిరుమలగిరి 
తిరుమలగిరి పట్టణ కేంద్రానికి చెందిన పలు పాఠశాలలు తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఫాతిమా హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్ లలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా  పాఠశాలల ప్రిన్సిపాళ్లు  మాట్లాడుతూ.. విద్యార్థులు మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి వాటిని ఆచరించి అంతరించిపోకుండా ముందు తరాలకు అందివ్వాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమే బతుకమ్మ పండుగ అని, తెలంగాణ బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు.తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ అన్నారు. అంతకుముందు విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి కళాశాల ఆవరణంలో బతుకమ్మ పాటల మధ్య ఆడి పాడారు. అమ్మాయిల ఆటపాటలతో పాఠశాలల్లో  కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్స్ సంజీవ్ కుమార్, దామెర శ్రీనివాస్, ఆంటోనీ,నగేష్ మరియు ఉపాధ్యాయులు,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.