ఘనంగా రధ సప్తమి వేడుకలు..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్ నందు గల వేదాంత భజన మందిరం నందు  రథసప్తమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సూర్యభగవానుడు తన అశ్వాలతో  రధాన్ని ఉత్తరం వైపు పయనించే రోజుని దేశవ్యాప్తంగా రథసప్తమి నీ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయంలో అర్చకులు ధరూరి సింగరాచార్యులు, రాఘవాచార్యులు  సూర్య భగవానునికి పూజలు నిర్వహించారు. ఆదిత్య హ్ర్రదయం పారాయణం, అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు.అనంతరం సూర్య భగవానుడు అశ్వాలపై ఊరేగే విధంగా సూర్యప్రభ వాహనం అలంకరణ చేశారు. గుడి ఆవరణలో సూర్య భగవానునికి మహా  నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు తీర్ద  ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వ అనంతరం ప్రత్యేకంగా పూలతో  అలంకరించిన  సూర్యప్రభ  వాహనంలో సూర్య భగవానుని పట్టణంలోని వీధుల గుండా కోలాటాలు, భజనలతో ఊరేగింపు నిర్వహించి భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర రావు, కార్యదర్శి నకిరకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, శీలా శంకర్, తదితరులు పాల్గొన్నారు.