జామే మస్జీద్  ఆవరణలో ఘనంగా గణతంత్ర వేడుకలు

నవతెలంగాణ – చండూరు 
చండూరు పట్టణ కేంద్రంలో  ముస్లీం మైనార్టీ సోదరులు గణతంత్ర దీనోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మస్జీద్ ఆవరణలో ముజాహిద్ ఆలి  జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులు ఎం.డి. నిరంజన్ అలీ రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ హాజరై  మాట్లాడుతూ  భారతదేశ స్వాతంత్ర మరియు రాజ్యాంగ నిర్మాణ సందర్భంలో ముస్లింల పాత్ర ఎనలేనిది అని , భారతదేశ సర్వమత సౌబ్రాతృత్వ దేశమని ఇంతటి గొప్ప దేశం ప్రపంచంలో మరెక్కడాలేదని ఆయన అన్నారు. భారతదేశ రక్షణ, అభివృద్ధిలో గతంలో కూడా ముస్లిం ప్రజల రక్తము చెమట ఉన్నదని భవిష్యత్తులో కూడా ముస్లిం ప్రజలు దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా  వెనకాడరని అన్నారు. ఈ  కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కో ఆప్షన్ మహమ్మద్ అలీ జిన్నా ,మహిమూద్,రఫీ, ఖమ్రుద్దీన్,ఎజాస్, సయ్యద్ జావిద్, గౌస్, ఖలీల్ ,మరియు పట్టణ ముస్లిం మైనార్టీ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.