ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – పెద్దవంగర

గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై పిల్లల రాజు, మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం రమణాచారి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, బీజేపీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, పెద్దవంగర సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.