ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన డిసిసిబి చైర్మన్  గొంగిడి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట  మండలం వంగపల్లి శుక్రవారం, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వంగపల్లిలోని జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం అదేవిధంగా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ భారతదేశ అవతరించిన రోజు సందర్భంగా భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వంగపల్లి పాలకవర్గ సభ్యులు సిబ్బంది వంగపల్లి గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.