
గణతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శంకర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో మహేందర్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో మొహమ్మద్ సౌద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ భీమ్ రావు, ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ మేకల వెంకన్న తో పాటు గ్రామపంచాయతీలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో, పలు పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళి అర్పించారు. అంతేకాకుండా మండల కేంద్రంలోని కురుక్షేత్ర స్కూల్, శ్రీ సరస్వతీ శిశు మందిర్, శ్రీ వెంకటేశ్వర పాఠశాల విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, అధికారులు, నాయకులు జల్కె పాండురంగ్, డుబ్బుల చంద్ర శేఖర్, చిల్కూరి భూమన్న తదితరులు పాల్గొన్నారు.