ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Grand Republic Day celebrations..నవతెలంగాణ – మద్నూర్ 
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల  నందు కళాశాల ప్రిన్సిపల్ కే.అశోక్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు  తెలిపారు, రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతల తో నడుచుకుంటూ ఉత్తమ పౌరులుగా దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలని  విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.