
ఉప్పునుంతల మండలం కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. తహసిల్దార్ అధికారి తాబితారాణి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలలో డిప్యూటీ తాసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించిన అనంతరం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పద్ధతిగా ఆటపాటలతో రెవెన్యూ అధికారులు కలిసికట్టుగా డ్యాన్సులు చేస్తూ సంతోషించారు.