బాల్కొండ పోలీస్ స్టేషన్ లో మంగళవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.. ఈ వేడుకలలో బాల్కొండ ఎస్సై కే గోపి, ఏఎస్సై శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.