
75గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరుదొడ్డి మండలం లో లింగుపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, గ్రామపంచాయతీ ఐకెపి కార్యాలయం ముందు సర్పంచ్ బానరసింలు మహేష్ ఆధ్వర్యంలో ఎగరవేశారు అల్వాల కూడలిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ , బాల నరసింహులు మాట్లాడుతూ. విద్యార్థులు సర్వతోముఖ అభివృద్ధి సాధించాలన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. గణతంత్ర దినోత్సవ ఔన్నత్యాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, అధ్యాపక బృందం , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .