నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్షిక వేడుకలను పటాన్‌చెరువులోని రెసోనెన్స్ గురుకుల క్యాంపస్‌లో ‘రెసో దర్పణ్’ థీమ్‌తో ఘనంగా నిర్వహిం చారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ హాజరయ్యారు. రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటీ-జేఈఈ, నీట్, జేఈఈ, ఇంజినీరింగ్/మెడికల్/కామర్స్/లా ప్రవేశ పరీక్షల శిక్షణలో అగ్రగామిగా ఉంది. ఈ వేడుకలకు డీఈవో ఎస్ వెంకటేశ్వర్లు, పటాన్‌చెరువు ఎంఈవో పీపీ రాథోడ్, భానూర్ పీఎస్‌ఎస్‌హెచ్‌వో రవీందర్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా అభిజ్ఞ అండ్ మిస్ పర్ఫెక్ట్ మూవీ టీమ్ సభ్యు లు హాజరయ్యారు. రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూ షన్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచం ద్రరావు మాట్లాడుతూ.. రెండేళ్లుగా రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్స లెన్స్ అకడమిక్, హౌలి స్టిక్ ఎడ్యుకేషన్‌లో ఒక వెలుగు వెలిగిందన్నారు. సంస్కృతీ, క్రీడలు, వివిధ పాఠ్యేతర కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిబద్ధత పాఠ్య పుస్తకాలను మించి ఉందన్నారు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి విజయాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తు న్నామని చెప్పారు. గైడెన్స్ అనేది తరగతి గదికి మిం చి అందించాలన్నదే లక్ష్యమన్నారు. రెసోనెన్స్‌లో అం కితభావం కలిగిన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషి స్తున్నారని తెలిపారు. వీరు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. ప్రతి విద్యార్థి పూర్తి సామర్థ్యాన్ని చేరుకు నేలా ప్రోత్సహిస్తారని చెప్పారు. అచంచలమైన నిబద్ధతే విజయానికి మూలస్తంభం అన్నారు. ఉపాధ్యా యులను ప్రశంసించారు. వీరిలో ప్రతి ఒక్కరూ అసాధారణ కథలో అంతర్భాగం అన్నారు. ఈ సంతో షకరమైన వేడుకను, రెసో దర్పణ్ స్ఫూర్తిని ముందుకు తీసుకువె ళదామ న్నారు. ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దామ న్నారు. కార్యక్రమంలో అభ్యాసకుల కుటుంబా లతో సహా 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.