ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్ కొమ్మినేని కాలనీ లో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ అద్వర్యంలో నిర్వహించిన సద్ధుల బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో  బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. మహిళలు, యువతులు చిన్నారులు దాండియా కోలాటలు ఆడారు, అనంతరం బతుకమ్మను గంగమ్మ వడికి చేర్చారు. ఈ వేడుకలలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ మరియు కాలనీ వాసులు మహిళా సోదరి మణులు పాల్గొన్నారు.