
మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీఆర్ యూత్, పోచమ్మ కాలనీలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పసుపుతో గౌరమ్మను పేర్చి పూజారి మంత్రోత్సరణతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మహిళలు, ఏబీఆర్ యూత్ సభ్యులు పొన్నాల అరుణ్, మంద ప్రకాష్, మంద అరవింద్, కొంకటి దామోదర్, వేల్పుల శంకర్, వేల్పుల సంపతి, శ్రీ గణేష్ యూత్ కమిటీ అధ్యక్షుడు జాలిగాం శంకర్, మామిడి కరుణాకర్, జాలిగాం రాజు, గడ్డం మహేష్, గూళ్ళ సతీష్, ముంజ శివ, గడ్డం రాజేష్, తదితరులు పాల్గొన్నారు.