నవతెలంగాణ జన్నారం
జన్నారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల వినాయక మండపం వద్ద బుధవారం స్థానిక మహిళలు ఘనంగా సాముహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మాసం రాజన్న పురోహిత్ అధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్దయెత్తున హాజరై కుంకుమ పూజలు చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.