ఎన్ జి ఎస్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో  ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు పండగ సాంప్రదాయ దుస్తులను ధరించి ఉదయం పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులందరికీ ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లు నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశిస్తూ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ ప్రిన్సిపల్ శ్రీదేవి లు మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా అన్ని పండగలు మా పాఠశాలలో జరుపుకుంటామని, దాని పురస్కరించుకొని ఈ మేరకు గురువారం తమ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. సంక్రాంతి పండగ అనగానే తెలుగింటి ఆడవారు ఉదయాన్నే లేచి, ఇంటిముందు రంగురంగుల హరవిల్లు ల ముగ్గులు వేస్తారని అన్నారు. ఇల్లంతా కొత్త అల్లుళ్లతో నిండి పండగ వాతావరణం నెలకొంటుందని, కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే ఈ మకర సంక్రాంతి తెలుగువారూ అందరూ జరుపుకునే పండగ అని, కొత్త ధాన్యం ఇంటికి వస్తుందని ఆయన తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో విజయం సాధించిన వారికి మేమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ టి లత, వైస్ ప్రిన్సిపాల్ సరిత, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.