కామారెడ్డి జిల్లాలోని ఆర్కిడ్స్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించరు. ఈ వేడుకలో విద్యార్థులు హరిదాసు వేషధారణలో వివిధ రకాల సంస్కృతిక దుస్తులతో అందరిని ఆకర్షించినారు. బొమ్మల కొలువుతో పాటు, ఈ ముగ్గుల పోటీలో విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులతో పాటుగా హరిదాసు, గంగిరెద్దుల బొమ్మలను ముగ్గులతో వేసి, ఆ బొమ్మలను గొబ్బెమ్మలతో అలంకరించి అందరిని అబ్బుర పరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదేవిధంగా ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తు వేడుకలను నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సి.ఈ.వో. యం. జైపాల్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ యం. సదాశివరెడ్డి, వైస్. ప్రిన్సిపాల్ భూలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.