టైం స్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 

– ముగ్గుల పోటీలు 

నవతెలంగాణ-హాలియా : స్థానిక టైం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను మరియు ముగ్గుల పోటీలను నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మందా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం నూతన సంవత్సరంలో మొదటి పండుగని దీనిని అందరూ సంస్కృతి సాంప్రదాయాలు విరసిల్లే లాగా జరుపుకోవాలని ఆయన అన్నారు. అనంతరం పాఠశాలలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడం కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటిరెడ్డి ఇతర డైరెక్టర్లు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.