నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ సావిత్రిబాయి చేసిన సేవలను గుర్తు చేస్తూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రిగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని గుర్తు చేశారు .అనంతరం మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి , కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వాసుదేవ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.