
మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయం వద్ద మహశి మహశివరాత్రి వేడుకలను శుక్రవారం ఘనంగా గ్రామ కమిటీ అధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యెక పూజలు, అభిషేకలు చేశారు. అంగరంగా వైభవంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం జరిపారు. అనంతరం యజ్ఞ, హోమం కార్యక్రమలు చేశారు. విశ్వ బ్రాహ్మణ సభ్యులు యజ్ఞది కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంకాల సమయంలో స్వామి వారి ఊరేగింపు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులు అందరు పాల్గొనగలరు అని గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు నరేందర్, ఊరడీ నరేష్, గంగా ప్రసాద్, మేకల లక్ష్మి నారాయణ, ఇటుకల నరేష్, మల్లేష్ గౌడ్, కల్లెడ అనిల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు